Guntur Railway Junction : 9 రోజుల పాటు ప‌లు రైళ్లు ర‌ద్దు

రైల్వే డ‌బ్లింగ్ ప‌నులే కార‌ణం

Guntur Railway Junction : గుంటూరు గుంత‌క‌ల్లు రైల్వే డ‌బ్లింగ్ ప‌నులు తుర్లుపాడు స్టేష‌న్ నుండి జ‌గ్గంభోట్ల కృష్ణ‌పురం వ‌ర‌కు కొన‌సాగుతున్నాయి. ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు గుంటూరు డివిజ‌న్ రైల్వే(Guntur Railway Junction) ఆప‌రేష‌న్స్ మేనేజ‌ర్ కిర‌ణ్ కుమార్ వెల్ల‌డించారు. చివ‌రి ద‌శ ప‌నుల రీత్యా జూన్ 27 నుండి 9 రోజుల పాటు ప‌లు రైళ్లను నిలిపి వేసిన‌ట్లు పేర్కొన్నారు.

ర‌ద్దు చేసిన రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 17728 నంబ‌ర్ క‌లిగిన గుంటూరు డోన్ ట్రైన్ , 17261 నంబ‌ర్ క‌లిగిన గుంటూరు తిరుప‌తి, 17251 గుంటూరు కాచిగూడ మ‌ధ్య తిరిగే రైళ్లు న‌డ‌వ‌వ‌ని తెలిపారు. వీటితో పాటు 17254 గుంటూరు హైద‌రాబాద్ (డోన్ వ‌ర‌కు మాత్ర‌మే) రైలు, 07067 నంబ‌ర్ క‌లిగిన మ‌చిలీప‌ట్నం క‌ర్నూలు వ‌ర‌కు తిరిగే ట్రైన్ ను ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు కిర‌ణ్ కుమార్.

జూన్ 28 నుండి జూలై 6 వ‌ర‌కు ర‌ద్దైన రైళ్లు ఇలా ఉన్నాయి. 17227 నంబ‌ర్ క‌లిగిన డోన్ గుంటూరు ట్రైన్ , 17262 నంబ‌ర్ క‌లిగిన తిరుప‌తి గుంటూరు, 17252 కాచిగూడ గుంటూరు(Guntur) , 17253 నంబ‌ర్ క‌లిగిన హైద‌రాబాద్ గుంటూరు, 07068 నంబ‌ర్ క‌లిగిన క‌ర్నూల్ మ‌చిలీప‌ట్నం రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు మేనేజ‌ర్.

జూలై 3 నుండి జూలై 5 వ‌ర‌కు ర‌ద్ద‌యిన రైళ్లు ఇలా ఉన్నాయి. 17329 నంబ‌ర్ క‌లిగిన హుబ్లీ విజ‌య‌వాడ రైలు, 17225 నంబ‌ర్ క‌లిగిన విజ‌య‌వాడ హుబ్లీ రైలు, 17215 నంబ‌ర్ క‌లిగిన మ‌చిలీప‌ట్నం ధ‌ర్మ‌వ‌రం ట్రైన్ ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

జూలై 4 నుండి జూలై 6 వ‌ర‌కు ర‌ద్ద‌యిన రైళ్లు ఇలా ఉన్నాయి. 17330 నంబ‌ర్ క‌లిగిన విజ‌య‌వాడ హుబ్లీ రైలు, 17226 నంబ‌ర్ క‌లిగిన హుబ్లీ విజ‌య‌వాడ ట్రైన్ , 17216 నంబ‌ర్ క‌లిగిన ధ‌ర్మ‌వ‌రం మ‌చిలీప‌ట్నం రైలును ర‌ద్దు చ‌సిన‌ట్లు పేర్కొన్నారు.

Also Read : PM Modi Tribute : పీవీ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!