Marcus Stoinis : అబ్బా మార్క‌స్ స్టోయినిస్ దెబ్బ

47 బంతులు 89 ర‌న్స్

Marcus Stoinis : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద్భుత విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 177 ర‌న్స్ చేసింది. వెంట వెంట‌నే వికెట్లు కోల్పోయినా ఆ త‌ర్వాత పుంజుకుంది. కెప్టెన్ కృనాల్ పాండ్యా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 49 ప‌రుగుల‌కు గాయం కావ‌డంతో రిటైర్డ్ హ‌ర్ట్ గా వెనుదిరిగాడు. ఇక పాండ్యాతో కలిసి మార్క‌స్ స్టోయినిస్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. అద్బుత‌మైన షాట్స్ తో అల‌రించాడు.

మైదానం న‌లు వైపులా ఆడుతూ ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఇద్ద‌రూ క‌లిసి ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ముంబై బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు స్టోయినీస్. కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 89 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ చివ‌రి దాకా పోరాడింది. 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 22 బంతులు ఎదుర్కొని 37 ర‌న్స్ చేస్తే , ఇషాన్ కిష‌న్ 39 బాల్స్ ఎదుర్కొని 59 ప‌రుగులు చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 90 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక సూర్య కుమార్ యాద‌వ్ 7 ప‌రుగులే చేసి నిరాశ ప‌రిచాడు. ఆఖ‌రులో టిమ్ డేవిడ్ 32 ర‌న్స్ చేసినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు.

Also Read : LSG vs MI IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!