BCCI Mastercard : బీసీసీఐతో మాస్ట‌ర్ కార్డ్ ఒప్పందం

టైటిల్ స్పాన్స‌ర్ షిప్ కైవ‌సం

BCCI Mastercard : ప్ర‌పంచ క్రికెట్ లో అత్య‌ధిక ఆధాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) పేరొందింది. ఇప్ప‌టికే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కోట్లాది రూపాయ‌లు ప్ర‌సార హ‌క్కుల్ని ద‌క్కించుకున్నాయి.

తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది బీసీసీఐ. ఇప్ప‌టికే బీసీసీఐ టైటిల్ స్పాన్స‌ర్ షిప్ హ‌క్కుల్ని ద‌క్కించు కునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి.

తాజాగా చివ‌ర‌కు ఈ హ‌క్కుల్ని గ్లోబ‌ల్ పేమెంట్స్ అండ్ టెక్నాల‌జీ కంపెనీ మాస్ట‌ర్ కార్డ్(BCCI Mastercard) ద‌క్కించుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్రువీక‌రించింది. ఇప్ప‌టి దాకా బ‌సీసీఐ టైటిల్ స్పాన్స‌ర‌ర్ గా ప్ర‌ముఖ దేశీయ డిజిట‌ల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఉండింది. కానీ త‌ప్పు కోవ‌డంతో దాని స్థానంలో మాస్ట‌ర్ కార్డ్ వ‌చ్చింది.

పేటీఎం అభ్య‌ర్థ‌న మేర‌కే బీసీసీఐ(BCCI) టైటిల్ స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను మాస్ట‌ర్ కార్డుకు బ‌ద‌లాయించిన‌ట్లు స‌మాచారం. కాగా ఎంత మేర‌కు మాస్ట‌ర్ కార్డ్ డ‌బ్బుల‌ను ఆఫ‌ర్ చేసింద‌నే విష‌యం మాత్రం బీసీసీఐ వెల్ల‌డించ‌ లేదు.

అటు వ‌దులుకున్న పేటీఎం కానీ ఇటు బీసీసీఐ కానీ మ‌రో వైపు మాస్ట‌ర్ కార్డ్ కానీ ప్ర‌క‌టించ లేదు. ఇందుకు సంబంధించి గ‌తంలో 2015లో పేటీఎం నాలుగు సంవ‌త్స‌రాల‌కు గాను రూ. 203 కోట్ల‌కు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పుడు అంత‌కంటే ఎక్కువ చెల్లించి మాస్ట‌ర్ కార్డ్ కైవ‌సం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఇప్పుడు బీసీసీఐకి కాసుల పంట పండుతోంది.

Also Read : కంట్రోల్ చేసుకోక పోతే ఎలా కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!