Matheesha Pathirana : పతిరాణా సెన్సేషన్ ముంబై పరేషాన్
4 ఓవర్లు 15 రన్స్ 3 వికెట్లు
Matheesha Pathirana : ఐపీఎల్ 16వ సీజన్ లో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మరో వైపు సీనియర్లు సైతం తమకు ఎదురే లేదని దూసుకు పోతుండగా బౌలర్లు మాత్రం తమదైన శైలిలో రాణిస్తున్నారు. అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టిస్తున్నారు. ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లు సైతం ఆడేందుకు నానా తంటాలు పడుతున్నారు. వికెట్లు కాపాడుకునేందుకు డిఫెన్స్ ను ఆశ్రయిస్తున్నారు.
ఐపీఎల్ లో రషీద్ ఖాన్ సత్తా చాటితే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంకకు చెందిన స్టార్ బౌలర్ మతీషా పతిరాణా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు.
ఆ జట్టుకు అతడే కీలకమైన బౌలర్ గా ఎదిగాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగను పోలి ఉంటుంది మతీషా పతిరాణా(Matheesha Pathirana) బౌలింగ్. అతడిపై కూడా విమర్శలు వెల్లువెత్తినా ఎక్కడా తగ్గలేదు జార్ఖండ్ డైనమెంట్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్ . టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు మతీషా పతిరాణా.
4 ఓవర్లు వేసిన పతిరాణా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన 3 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా మలింగ పతిరాణాకు బౌలింగ్ మెళకువులు నేర్పించడంలో సక్సెస్ అయ్యాడు. ధోనీ ఎవరిని ప్రోత్సహిస్తాడో వాళ్లు సత్తా చాటడం ఖాయం. ఇందులో పతిరాణా ఉండగా మరొకరు అజింక్యా రహానే కావడం విశేషం.
Also Read : రాణించిన రుతురాజ్ మెరిసిన కాన్వే