Matheesha Pathirana : ఎవరీ జూనియర్ మలింగ ఏమిటా కథ
ఐపీఎల్ లో ఆకట్టుకుంటున్న పతిరన
Matheesha Pathirana : ఎవరీ మతీష పతిరన అనుకుంటున్నారా జూనియర్ మలింగగా పేరు పొందాడు. ద్వీప దేశం శ్రీలంక క్రికెట్ లో ఇప్పుడు స్టార్ బౌలర్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.
గతంలో ఆ దేశం తరుపున అద్భుతమైన బౌలర్ గా పేరొందిన లసిత్ మలింగ ను మైమరిపించేలా బౌలింగ్ చేస్తూ సత్తా చాటుతుండడంతో మతీష పతిరణకు జూనియర్ మలింగ అంటూ పిలవడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ముంబై వేదికగా జరుగుతున్న ఈ రిచ్ లీగ్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తాజాగా శుభ్ మన్ గిల్ ను ఔట్ చేసిన తీరుతో హాట్ టాపిక్ గా మారాడు. 18 డిసెంబర్ 2002లో శ్రీలంకలోని కాండీ నగరంలో పుట్టాడు. మతీష పతిరన(Matheesha Pathirana) వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే.
అతడి బౌలింగ్ తీరుతో జాతీయ జట్టునే కాదు ఇతర దేశాలను కూడా ఆకర్షించేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అద్భుతమైన బంతులతో మెస్మరైజ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు జూనియర్ మలింగ(Matheesha Pathirana).
2021లో శ్రీలంకలో శ్రీలంక లీగ్ క్రికెట్ (ఎస్ఎల్సీ) టీ20 లీగ్ లో ఎస్ఎల్సీ గ్రేస్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టులో పొట్టి ఫార్మాట్ లో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు అండర్ -19 జట్టులో వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు.
2022 జనవరిలో జరిగిన ఐసీసీ అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఆ దేశ జట్టు తరపున ఆడాడు మతీష పతిరన. ఇక బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటలో సీఎస్కే ఆడమ్ మిల్నేకు బదులుగా జూనియర్ మలింగను దక్కించుకుంది.
Also Read : రాణించిన జైస్వాల్ మెరిసిన బౌల్ట్