Matheesha Pathirana : మ‌తీషా ప‌తిరాణా మ‌జాకా

బౌలింగ్ దెబ్బ‌కు ఢిల్లీ విల‌విల

శ్రీ‌లంకకు చెందిన మ‌తీషా ప‌తిరాణా మ‌రోసారి చుక్క‌లు చూపించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 16వ సీజ‌న్ లో బౌల‌ర్ల‌లో టాప్ బౌల‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ కుర్రాడి బౌలింగ్ కు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్లు బెంబేలెత్తి పోతున్నారు. ఒక‌ప్పుడు త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో ముప్పు తిప్ప‌లు పెట్టిన స్టార్ పేస‌ర్ ల‌తిస్ మ‌ళింగను పోలి ఉంటుంది మ‌తీషా ప‌తిరాణా బౌలింగ్.

ఇక టాలెంట్ ఎక్క‌డ ఉన్నా స‌రే దానిని గుర్తించి వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించ‌డం జార్ఖండ్ డైన‌మెట్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి అల‌వాటు. త‌న సూప‌ర్ స్పెల్స్ తో ఆక‌ట్టుకున్నాడు మ‌తీశా ప‌తిరాణా. ఆ వెంట‌నే వేలం పాట‌లో ఎవ‌రికీ ద‌క్క‌కుండా త‌ను స్వంతం చేసుకున్నాడు ధోనీ. అంతెందుకు ఎవ‌రూ కొనేందుకు ఆస‌క్తి చూప‌ని ప‌క్షంలో అజింక్యా ర‌హానేకు ఛాన్స్ ఇచ్చాడు.

ఈసారి ఐపీఎల్ లో దుమ్ము రేపాడు. ఒక్క‌సారి న‌మ్మాడంటే ఆ ఆట‌గాడు రాణించాల్సిందే. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చుక్క‌లు చూపించాడు మ‌తీషా ప‌తిరాణా. 4 ఓవ‌ర్లు వేసి 37 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు. సీఎస్కే విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు శ్రీ‌లంక బౌల‌ర్. ప‌తిరాణాతో పాటు జ‌డ్డూ ర‌వీంద్ర జ‌డేజా సైతం 3 వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!