#MatlaTirupathi : ప‌ల్లె పాట‌ల ప‌రిమ‌ళం..మ‌ట్ల తిరుప‌తి గాత్రం

ప్ర‌కృతి విధ్వంసానికి గుర‌వుతున్న వేళ‌..కార్పొరేటీక‌ర‌ణ పురివిప్పుతున్న వేళ‌..అన్ని క‌ళ‌లు..సంస్క‌తులు..నాగ‌రిక‌త‌లకు ప్ర‌తీక‌లైన ప‌ల్లెత‌న‌పు పోక‌డ ప్ర‌మాద‌క‌రమైన సంద‌ర్భంలో ఓ గ‌ళం మెల్ల‌గా త‌న గొంతుక‌ను విప్పింది..అదే మ‌ట్ల తిరుప‌తి.

జిమ్మిక్కులు..మ్యాజిక్కులు..మెస్మ‌రైజ్‌లంటూ ఏవీ లేనే లేవు. ప్ర‌కృతి విధ్వంసానికి గుర‌వుతున్న వేళ‌..కార్పొరేటీక‌ర‌ణ పురివిప్పుతున్న వేళ‌..అన్ని క‌ళ‌లు..సంస్క‌తులు..నాగ‌రిక‌త‌లకు ప్ర‌తీక‌లైన ప‌ల్లెత‌న‌పు పోక‌డ ప్ర‌మాద‌క‌రమైన సంద‌ర్భంలో ఓ గ‌ళం మెల్ల‌గా త‌న గొంతుక‌ను విప్పింది..అదే మ‌ట్ల తిరుప‌తి. మ‌ట్టిత‌న‌పు ఆపాదించుకున్న సిస‌లైన తెలంగాణ ప‌ల్లె పాట‌ల ప‌రిమ‌ళం. అప్పుడెప్పుడో ఆ గొంతు వృక్షాన్నిరా అన్న పాట కోట్లాది ప్ర‌జ‌ల‌ను అక్కున చేర్చుకుంది. మ‌నం కోల్పోతున్న ప‌ల్లె జీవితాన్ని..మ‌నకు మ‌నం కాకుండా పోతున్న వైనాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది. ఇక అప్ప‌టి నుంచి ఏదో ఒక సంద‌ర్భంలో మ‌ట్ల త‌న గాత్రానికి మెరుగులు దిద్దుతూనే కొత్త‌దనానికి పాట‌ను జోడించ‌డం మొద‌లు పెట్టాడు.
పైర‌వీలు..దేబ‌రింపులు..జోకొట్ట‌డాలు..పొగ‌డ్త‌లు..పైర‌వీలు..నోట్లు గుమ్మ‌రించ‌డాలు..కాకా ప‌ట్ట‌డాలు కొలువైన సినీ క‌ళా రంగాన్ని గూగుల్ ప‌టాపంచ‌లు చేసింది. అత్యంత ప్ర‌తిభా పాట‌వాలు, సామ‌ర్థ్యాలు క‌లిగి ఉన్నా కాసులు లేక త‌మ క‌ళ‌ను బ‌య‌ట‌కు తీసుకు రాలేక‌..ఒక‌వేళ వ‌చ్చినా ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం లేక నానా ఇబ్బందులు ప‌డ్డారు. ఎప్పుడైతే టెక్ దిగ్గ‌జం యూట్యూబ్ ను టేకోవ‌ర్ చేసుకోవ‌డం మొద‌లు పెట్టిందో ఇక మోనోప‌లీకి చెక్ పెట్టింది. ప్ర‌తిభ క‌లిగి ఉంటే చాలు ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే త‌మ క‌ళ‌ను అది ఏ ఫార్మాట్ అయినా స‌రే వీడియోల రూపంలో ప్ర‌పంచానికి తెలియ ప‌రిచే అవ‌కాశం ద‌క్కింది. దీంతో క‌ళాకారుల‌కు నెల‌వైన తెలంగాణ‌లో వేలాది మంది క‌వులు, క‌ళాకారులు, గాయ‌నీ గాయ‌కులు, న‌టీ న‌ట‌లు, ప్ర‌తిభావంతులు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, ప్ర‌యోక్త‌లు..ద‌ర్శ‌కులు, క‌ళా ద‌ర్శ‌కులు, ఛాయా చిత్ర‌కారులు, ఆర్టిస్టులు, డ‌బ్బింగ్ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫ‌ర్లు, కంటెంట్ రైట‌ర్లు ఇలా చెప్పుకుంటూ ప్ర‌తి ఒక్క‌రికి యూ ట్యూబ్ వేదిక‌గా వెన్ను ద‌న్నుగా నిలిచింది.
ఒక‌ప్పుడు సినిమా రంగంలో తెలంగాణ యాస , భాష అంటే ఈస‌డింపు..చీద‌రింపు..ఇపుడు సీన్ మారింది. ఎక్క‌డ చూసినా యూట్యూబ్ ప్లాట్ ఫాంలో తెలంగాణ బిడ్డ‌ల‌దే హ‌వా..ఇక మ‌ట్ల తిరుప‌తి ఒక ఉప్పెన‌లా దూసుకు వ‌చ్చాడు. ప్రవాహ‌మై పాట‌ల‌ను అల్లుకుంటూ పోతున్నాడు. అత‌డిలోని గాత్ర మాధుర్యం, ప్ర‌తిభా నైపుణ్యం తోడై ప‌సందైన గేయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏమే పిల్లా అన్న‌ప్పుడ‌ల్లా..ఇలాంటి పాట‌లు ఎన్నో సై టీవీ ద్వారా యూ ట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎంద‌రో కొత్త వారు త‌మ ప్ర‌తిభ‌తో అల‌రిస్తున్నారు. ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌జ‌లంద‌రి హృద‌యాల‌ను ఆనంద డోలిక‌ల్లో మునిగేలా చేస్తున్నారు. మ‌రిన్ని పాట‌ల‌తో అల‌రించాల‌ని..ప‌ల్లెత‌న‌పు సొగ‌సుల‌ను చూపించేలా..ఆట‌ల‌తో ఆక‌ట్టుకునేలా చేయాల‌ని కోరుకుందాం.

No comment allowed please