Mayank Agarwal : మయాంక్ మెరిసినా తప్పని ఓటమి
భారీ స్కోర్ చేసినా హైదరాబాద్ కు షాక్
Mayank Agarwal : ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిచింది రోహిత్ సేన.
ఆరంభంలో ఇబ్బంది పడినా తర్వాత వరుస విజయాలతో దుమ్ము రేపింది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడా తగ్గలేదు. 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 200 రన్స్ చేసింది. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) దంచి కొట్టాడు. చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 46 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4 సిక్సర్లతో 83 రన్స్ చేశాడు. వివ్రాంత్ శర్మ 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్సర్లతో దంచి కొట్టారు. 69 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ పై ఇదే భారీ స్కోర్ కావడం విశేషం హైదరాబాద్ కు.
ఐపీఎల్ 16 సీజన్ లో పాయింట్ల పరంగా ఆఖరున నిలిచింది. గత ఏడాది సీజన్ లో సైతం తీవ్ర నిరాశ పరిచింది. పూర్తిగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి వివ్రాంత్ శర్మ అద్భుతంగా ఆడాడు. కీలకమైన పాత్ర పోషించాడు. కానీ తట్టుకోలేక పోయారు సన్ రైజర్స్ హైదరాబాద్ సిఇఓ కావ్య మారన్.
Also Read : Cameron Green