Mayawati : ఎస్పీ..బీజేపీపై మాయావతి ఫైర్
రామచరిత్ మానస్ వివాదం ఆ పార్టీలకే లబ్ది
Mayawati : యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి(Mayawati) షాకింగ్ కామెంట్స్ చేశారు. సమాజ్ వాది పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ప్రస్తుతం రామచరిత్ మానస్ వివాదం కావాలని ముందుకు తెచ్చాయని ఇది పూర్తిగా ఆ పార్టీలకే మేలు చేకూర్చేలా ఉందంటూ మండిపడ్డారు మాయావతి.
ఇది పూర్తిగా కావాలని ఆడుతున్న నాటకమని ఎదేవా చేశారు. దేశంలో కులం, ప్రాంతం, మతం పేరుతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ చరిత్ మానస్ పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఆ పార్టీలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం ఏనాడో మానేశాయని, రాష్ట్రంలో, కేంద్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. ఎంత సేపు మతం దాని చుట్టూ ఉన్న సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తూ అసలు సమస్యలు పక్కదారి పట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోందంటూ ధ్వజెత్తారు మాయావతి.
సోమవారం బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి(Mayawati) మీడియాతో మాట్లాడారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను ఎస్పీ , బీజేపీ నమ్ముకున్నాయంటూ ఆరోపించారు. కొన్ని శ్లోకాలు సమాజంలోని పెద్ద వర్గాన్ని అవమానించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన వచనం లోని ఆ భాగాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలను కోసం కొత్త వివాదాలకు తెర తీసిందన్నారు కుమారి మాయావతి. రామచరిత్ మానస్ ముసుగులో ఎస్పీ అదే రాజకీయ రంగు పులుముకుందన్నారు.
Also Read : ఓ మహాత్మా ఓ మహర్షీ – మోదీ