Medaram Jathara : పోలీసులు సీసీ కెమెరాల సెక్యూరిటీతో మేడారం జాతర

ప్రశాతం అధ్యాత్మిక వాతావరణంలో మహా జాతర సాగేలా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు

Medaram Jathara : మేడారం మహా జాతరకు(Medaram Jathara) సమయం ఆసన్నమైంది.. జనమంతా ఆ వన దేవతల సన్నిధి వైపు అడుగులు వేస్తున్నారు. మినీ కుంభమేళాగా నాలుగు రోజుల జాతరకు కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనాలు వేస్తున్నారు. గత జాతర చరిత్ర ప్రకారం ఇప్పటివరకు మేడారం జాతరకు కోటి మంది భక్తులే హైయెస్ట్ రికార్డ్..! కానీ ఈసారి కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మహా జాతర నిర్వహణలో పోలిస్ పాత్రే అత్యంత కీలకం. అందుకు తగిన ఏర్పాట్లలో పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది.

Medaram Jathara Updates

జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా శభరీష్ నేతృత్వంలో ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మహా జాతరకు తరలివచ్చే భక్తులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనువణువు నిఘా నేత్రలతో కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ సెట్అప్ చేశారు..14 వేల మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. ఇందులో వెయ్యి మంది మహిళా పోలీసులు జాతర విధుల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం ఐదు రహదారులలో డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా, ఇమీడియట్‌గా పోలీసులు స్పందించేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రశాతం అధ్యాత్మిక వాతావరణంలో మహా జాతర సాగేలా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా గద్దెల ప్రాంతంలో తోపులాట ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. క్యూలైన్‌లో తోపులాట జరుగుతుంటాయి. చాలామంది స్పృహతప్పి పడి పోతుంటారు. కొబ్బరి చిప్పలు తగిలి గాయాల పాలవుతమతుంటారు. అలాగే సందట్లో సడేమియాలాగా, చైన్ స్నాచింగ్స్, దొంగతనాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తున్నారు.

అనువణువు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా, ములుగు ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కూడా సంచరిస్తుందనే సమాచారం పోలీసు నిఘా వర్గాల గుర్తించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులపై కూడా పోలీసులు డేగకన్ను పెట్టారు. పోలీస్(Police) నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా సంచరించడంతోపాటు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. ఇక ఈసారి జాతరను పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు.

Also Read : King Charles Suffer : క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ అధ్యక్షుడు కింగ్ చార్లెస్ 3

Leave A Reply

Your Email Id will not be published!