King Charles Suffer : క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ అధ్యక్షుడు కింగ్ చార్లెస్ 3

అయితే, ఈ సమయంలో అతను పత్రాలపై సంతకం చేయడం, రాజభవనం లోపల చిన్న ప్రైవేట్ సమావేశాలను నిర్వహించడం వంటివి కొనసాగిస్తారు

King Charles Suffer : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్‌కు పరీక్షలు నిర్వహించగా.. ఆ వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది..అయితే, కింగ్ చార్లెస్(King Charles) ఏ క్యాన్సర్‌తో బాధపడుతున్నారో అధికారికంగా చెప్పనప్పటికీ 75 ఏళ్ల రాజు ఛార్లెస్ 3 సాధారణ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది. బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

King Charles Suffer With Cancer

75 ఏళ్ల కింగ్ చార్లెస్ విస్తరించిన ప్రోస్టేట్ చికిత్సలో క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ప్రకటన పేర్కొంది. కింగ్ చార్లెస్‌కు ఏ రకమైన క్యాన్సర్ ఉంది. ఃశరీరంలోని ఏ భాగంలో ఉందో ప్రకటనలో పేర్కొనలేదు. రాజుగారి క్యాన్సర్‌కు ప్రోస్టేట్‌కు సంబంధం లేదని, సోమవారం నుంచి ఆయనకు చికిత్స ప్రారంభించినట్లు వెల్లడించింది. కింగ్ చార్లెస్(King Charles) ఆసుపత్రిలో చేరలేదని, అతనికి ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక సోమవారం నుంచి కింగ్‌ చార్లెస్‌కు సంబంధించిన అన్ని పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు.

అయితే, ఈ సమయంలో అతను పత్రాలపై సంతకం చేయడం, రాజభవనం లోపల చిన్న ప్రైవేట్ సమావేశాలను నిర్వహించడం వంటివి కొనసాగిస్తారు. 2022 సెప్టెంబరు​లో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 96 ఏళ్ల వయసులో మరణించడంతో ఛార్లెస్​ 3 బ్రిటన్​ రాజుగా 74 సంవత్సరాల వయస్సులో బ్రిటన్ రాజు అయ్యారు. కాగా, కింగ్ చార్లెస్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని, త్వరలో తన రాజ బాధ్యతలను తిరిగి ప్రారంభిస్తారని రాజకుటుంబ ప్రతినిధి తెలిపారు. అయితే, ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. “కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అతను ఏ సమయంలోనైనా పూర్తి శక్తితో తిరిగి వస్తాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదంటూ రిషి రాసుకొచ్చారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ సోషల్ మీడియా వేదికగా, “లేబర్ పార్టీ తరుఫున కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని రాశారు. అతను పూర్తిగా ఫిట్‌గా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : MP Venkatesh Netha : బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి మొదలైన ఎంపీల వలసలు

Leave A Reply

Your Email Id will not be published!