Media Waiting : మీడియా అత్యుత్సాంపై సెటైర్లు
చెర్రీ, ఉప్సీ డెలివరీ కవరేజీకి తిప్పలు
Media Waiting : రోజు రోజుకు ఇరు తెలుగు రాష్ట్రాలలో మీడియా అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు దేశంలోని మణిపూర్ తగలబడి పోతోంది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ వాటిపై ఫోకస్ పెట్టకుండా కేవలం సెలబ్రిటీకి సంబంధించి కూతురు పుడితే అక్కడ మీడియా మొత్తం వెయిటింగ్ చేయడం విస్తు పోయేలా చేసింది.
సోషల్ మీడియా(Media) వేదికగా పలువురు మేధావులు, బుద్ది జీవులు, ప్రజా సంఘాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ఇరు రాష్ట్రాలలో ప్రతిపక్షాలపై, ప్రధానంగా ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పా అంతా మోసే వాళ్లే ఉన్నారని అసలు వాస్తవాలను చూపించడం లేదని పేర్కొంటున్నారు.
కోట్లాది ప్రజలు తమకు మెరుగైన పాలన కావాలని, విద్యా, వైద్యం అందుబాటులో ఉండాలని కోరుతుంటే మీడియా మాత్రం వ్యక్తిగతంగా కవరేజీ ఇచ్చేందుకు ప్రయారిటీ ఇవ్వడంపై మండి పడుతున్నారు. ఉపాసన డెలివరీ కవరేజీ కోసం అపోలో ఆస్పత్రి ముందు ఇలా కొన్ని కెమెరాలు దర్శనం ఇచ్చాయి. దీనిపై సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఉపాసన బిడ్డకు జన్మనిస్తే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామిక వాదులు. ఇకనైనా ప్రజలు మారాలని కోరుతున్నారు.
Also Read : PM Modi : భారత దేశం అత్యంత కీలకం