Meena Slams : బండారు కామెంట్స్ మీనా సీరియ‌స్

టీడీపీ మాజీ మంత్రి కామెంట్స్ పై ఫైర్

Meena Slams : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, ప్ర‌ముఖ న‌టి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆమెను స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా నీచాతి నీచంగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బండారు స‌త్య నారాయ‌ణ చౌద‌రి కామెంట్స్ చేశారు. ఆమె చ‌రిత్ర అంద‌రికీ తెలుస‌ని, బ్లూ ఫిలింల‌లో న‌టించింద‌ని, ప‌లువురితో ప‌డుకుంద‌ని , ఆ చిట్టా అంతా త‌న వ‌ద్ద ఉంద‌ని హెచ్చ‌రించారు.

Meena Slams Bandaru Satyanarayana

ఒక ర‌కంగా బ్లాక్ మెయిలింగ్ చేసేలా వ్యాఖ్యానించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఖుష్బూ , రాధికా శ‌ర‌త్ కుమార్ . తాజాగా సీనియ‌ర్ న‌టి మీనా(Meena) స్పందించారు. ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి సంఘీభావం తెలిపారు. యావ‌త్ మ‌హిళా స‌మాజం సిగ్గుతో త‌ల దించుకునేలా పురుష అహంకారంతో బండారు కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

టీడీపీ క‌నీసం స్పందించ‌క పోవ‌డంపై మండిప‌డ్డారు. ఇదేనా మీరు మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం అని ప్ర‌శ్నించారు మీనా. బండారు స‌త్య నారాయ‌ణ చౌద‌రి త‌క్ష‌ణ‌మే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఆయ‌న ఇంట్లో కూడా మ‌హిళ‌ల‌ను చుల‌క‌న‌గా ఇలాగే మాట్లాడ‌తారా అంటూ నిల‌దీశారు మీనా.

Also Read : PM Modi : టీమిండియాకు మోదీ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!