Meg Lanning Skipper : ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌థిగా మెగ్ లాన్నింగ్

ప్ర‌క‌టించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ

Meg Lanning Skipper : బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో తొలిసారిగా శ‌నివారం నుంచి మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఫ్రాంచైజీలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. ముంబై వేదిక‌గా జ‌రిగిన వేలం పాట‌లో 87 మంది ప్లేయ‌ర్ల‌ను తీసుకున్నాయి. అత్య‌ధికంగా ముంబైకి చెందిన స్టార్ బ్యాట‌ర్ స్మృతీ మంధాన అమ్ముడు పోయింది. ఆమెను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేజిక్కించుకుంది. ఏకంగా రూ. 3.40 కోట్ల‌కు తీసుకుంది. ఇదే స‌మ‌యంలో ఆర్సీబీ స్కిప్ప‌ర్ గా కూడా ప్ర‌క‌టించింది.

ఆ జ‌ట్టుకు స్టార్ టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా హెడ్ కోచ్ గా ఉండ‌నుది. మొత్తం ఉమెన్స్ ఐపీఎల్ లో 5 జ‌ట్లు పాల్గొంటాయి. మార్చి 4 నుంచి 26 దాకా కొన‌సాగుతుంది ఈ రిచ్ లీగ్. ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు త‌మ కెప్టెన్ల‌ను ప్ర‌క‌టించాయి. కానీ నిన్న‌టి దాకా ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం తాత్సారం చేసింది.

శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌ర‌ల్డ్ మ‌హిళా క్రికెట్ లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ , స‌క్సెస్ ఫుల్ స్కిప్ప‌ర్ గా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ను కెప్టెన్ గా(Meg Lanning Skipper) ఎంపిక చేసిన‌ట్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్ర‌క‌టించింది.

అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. పొట్టి ఫార్మాట్ లో ఆమెకు తిరుగు లేదు. అందుకే డీసీ ఆమెను ఏరికోరి ఎంచుకుంది. ఇక భార‌త్ కు చెందిన జెమీమా రోడ్రిగ్స్ కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మెగ్ లాన్నింగ్ ను ఢిల్లీ మేనేజ్ మెంట్ రూ. 1.1 కోట్ల‌కు తీసుకుంది.

Also Read : సూర్యుడు..స‌ముద్రం ఆద‌ర్శం

Leave A Reply

Your Email Id will not be published!