Klin Kaara konidela : పాప పేరు క్లిన్ కారా కొణిదెల
వెల్లడించిన మెగాస్టార్ ఫ్యామిలీ
Klin Kaara konidela : ఎట్టకేలకు ఉత్కంఠకు ముగింపు పలికారు మెగా ఫ్యామిలీ. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ముద్దుల కొడుకు, నటుడు రామ్ చరణ్ , ఉపసానా కొణిదెల పండంటి పాపకు జన్మనిచ్చారు. కాగా ఎలాంటి పేరు పెడతారేమోనని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తాము కూడా పలు పేర్లను సూచించారు. కాగా అందరినీ విస్తు పోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఊయలలో పాపను పడుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఉపాసన కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టినట్లు స్వయంగా చిరంజీవి వెల్లడించారు.
ఈ పేరును లలిత సహస్ర నామం నుండి తీసుకున్నట్లు తెలిపారు. క్లీన్ కారా అనే పదం ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. దివ్యమైన తల్లి శక్తి. అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి శక్తివంతమైన రింగ్, వైబ్రేషన్ ఉందన్నారు మెగాస్టార్. ఆమె పెరిగి పెద్దమై తమ కలల్ని నిజం చేస్తుందని పేర్కొన్నారు మెగా ఫ్యామిలీ. మొత్తంగా పాప పేరు డిఫరెంట్ గా ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.
Also Read : PM Modi : మానవీయ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యత