Megastar Chiranjeevi Cutout : భోళా శంకర్ భారీ కటౌట్ సూపర్
సూర్యపేట రహదారి పక్కన హల్ చల్
Megastar Chiranjeevi Cutout : తెలుగు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు మెగాస్టార్ చిరంజీవి. చాలా మంది ఆయనతో నటించిన వాళ్లు తెర మరుగైతే మరికొందరు అడపా దడపా సినిమాలలో కనిపిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం రోజు రోజుకు మరింత యువకుడిగా మారి పోతున్నారు. ఓ వైపు తనయుడు రామ్ చరణ్ , తమ్ముడు పవన్ కళ్యాణ్ , అల్లుడు అల్లు అర్జున్ లతో పోటీ పడుతూ నటిస్తున్నారు. తనకు ఎవరూ సాటి రారంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు.
Megastar Chiranjeevi Cutout Viral
సూపర్ పర్ ఫార్మెన్స్ తో ఇరగదీస్తూ ఫ్యాన్స్ కు మరింత జోష్ తెప్పించేలా చేస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi Cutout).
ఆయనతో తాజాగా భోళా శంకర్ పేరుతో సినిమా తీశాడు దర్శకుడు మెహర్ రమేష్. తనలోని కసిని , క్రియేటివిటీని తెర పై కనిపించేలా చేశాడు. మెగాస్టార్ లో ఉన్న సత్తా ఏమిటో మరోసారి ప్రేక్షకులకు చూపించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్ దుమ్ము రేపుతున్నాయి. ఎక్కడ చూసినా మెగా స్టార్ మేనియానే కనిపిస్తోంది.
ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే భారీ ఆదరణ చూరగొంటోంది భోళా శంకర్. కాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఏకంగా 120 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. సూర్యాపేట – విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని సూర్యాపేట వద్ద దీనిని ఉంచారు. ప్రస్తుతం చిరంజీవి కటౌట్ హైలెట్ గా నిలిచింది. నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Brahmanandam KCR : బహ్మానందం ఆహ్వానం