Chiranjeevi : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల విషయంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరు కొంత వివాదానికి దారి తీసింది. ఈ తరుణంలో చిరంజీవి ఏపీ సీఎంను వ్యక్తిగతంగా కలవడం చర్చనీయాంశంగా మారింది.
జగన్ రెడ్డితో భేటీ సంతోషంగా ఉందన్నారు. పండుగ పూట తన సోదరుడు ఆహ్వానించి భోజనం పెట్టడం తనకు ఎనలేని ఆనందం కలిగించిందని చెప్పారు.
ఇవాళ తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చిరంజీవి(Chiranjeevi ). ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగానికి సంబంధించి చర్చించడం జరిగిందన్నారు.
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న బాధల గురించి వివరించానని తెలిపారు. జగన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు చిరంజీవి. టికెట్ల ధర విషయంలో గందరగోళం నెలకొంది.
ఈ తరుణంలో చర్చించేందుకు నన్ను ఆహ్వానించారని వెల్లడించారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నా అందరి మేలును కోరుకునే నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
జగన్ రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకం , భరోసా ఎంతో బాధ్యతగా అనిపించిందన్నారు. ఈ సందర్భంగా తాను ఇండస్ట్రీకి సంబంధించి చెప్పిన ప్రతి విషయాన్ని కూల్ గా విన్నారని చెప్పారు.
ఈ రంగంపై ఆధారపడి వేలాది మంది ఉన్నారని అన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు చిరంజీవి.
ఇప్పటి దాకా జారీ చేసిన జీవో పట్ల పునః పరిశీలిస్తామని చెప్పారన్నారు. భేటీ వివరాలను సినీ పెద్దలకు వివరిస్తానని వెల్లడించారు చిరంజీవి(Chiranjeevi ). మరోసారి జరిగే సమావేశానికి అందరం హాజరవుతామని వెల్లడించారు.
Also Read : కామెంట్స్ కలకలం సర్వత్రా ఆగ్రహం