Megastar Chiranjeevi : ప‌వ‌ర్ స్టార్ పై గాడ్ ఫాద‌ర్ కామెంట్

పొలిటిక‌ల్ కెరీర్ అత‌డి ఇష్టమ‌న్న చిరు

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను న‌టించిన గాడ్ ఫాద‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. త‌న తమ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అన్న ప్ర‌శ్న‌కు ఊహించ‌ని స‌మాధానం చెప్పారు.

గ‌తంలో పాలిటిక్స్ లోకి ఎంట‌రై త‌ప్పు ప‌ని చేశాన‌ని అన్నారు. అక్టోబ‌ర్ 5 ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా గాడ్ ఫాద‌ర్ మూవీ విడుద‌ల కానుంది ప్ర‌పంచ వ్యాప్తంగా. తాజా చిత్రంలో పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై డైలాగ్ పాపుల‌ర్ అయ్యింది. దీంతో తిరిగి ఆయ‌న రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు త‌న పేరు, ఫోటోతో కూడిన ఏఐసీసీ గుర్తింపు కార్డును సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం రాజ‌కీయ ప్ర‌వేశానికి మ‌రో కార‌ణం. గాడ్ ఫాద‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్ భారీగా కొన‌సాగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇప్పుడు కానీ భ‌విష్య‌త్తులో కానీ తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌న్నారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం ఏర్పాటు చేసి ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఘ‌న‌త ఈ న‌టుడిదే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న‌తోనే తాను రాజ‌కీయాల నుండి వెన‌క్కి త‌గ్గాన‌ని చెప్పారు.

త‌న మ‌ద్ద‌తు అత‌డికి ఉంద‌ని తాను ఏనాడూ చెప్ప‌లేద‌న్నారు గాడ్ ఫాద‌ర్. త‌న సోద‌రుడి నిబ‌ద్ద‌త‌, నిజాయితీ గురించి త‌న‌కు బాగా తెలుస‌న్నారు. ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చినా , ఎవ‌రి వైపు మొగ్గు చూపినా రాష్ట్రాన్ని పాలించేందుకు నిబ‌ద్ద‌త క‌లిగిన సీఎంను చూడాల‌ని త‌న‌కు కోరిక ఉంద‌న్నారు.

Also Read : పొన్నియిన్ సెల్వ‌న్ కాసుల వేట

Leave A Reply

Your Email Id will not be published!