Godfather : క‌లెక్ష‌న్ల వేట‌లో మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్

ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఆద‌ర‌ణ

Godfather :  ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్(Godfather)  మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్ గా మారింది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమా గురించి స‌మీక్ష‌లు కూడా బాగుందంటూ కితాబు ఇచ్చాయి.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రం టాకీసుల‌లో విడుద‌లైనప్ప‌టి నుండి బాక్సీఫీస్ ను శాసిస్తోంది. పండుగ స‌మ‌యంలో గాడ్ ఫాద‌ర్ ను విడుద‌ల చేయ‌డంలో చిత్ర నిర్మాత‌లు స‌క్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాత‌లు, సినీ టెక్నిషియ‌న్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రో వైపు స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియిన్ సెల్వ‌న్ మూవీ ఇప్ప‌టికే రూ. 400 కోట్లుకు పైగా వ‌సూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కూడా ఇప్ప‌టికే వ‌చ్చేసింది. ఇక గాడ్ ఫాద‌ర్ వ‌ల్ల సినిమాకు కొంచెం ఇబ్బందిగా మారినా చిరంజీవి సినిమా కంటే మ‌ణిర‌త్నం మూవీ విడుద‌ల కావ‌డంతో భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది.

ఇక గాడ్ ఫాద‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద మూడు రోజులు ముగిసే స‌రికి రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమా టోట‌ల్ క‌లెక్ష‌న్లు రూ. 80 కోట్లు వ‌సూలు కావ‌డం విశేషం. మొత్తంగా మెగాస్టార్ చిత్రం రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేరేందుకు ముందుకు సాగుతోంది. గాడ్ ఫాద‌ర్ త్వ‌ర‌లో యుఎస్ లో $1 మిలియ‌న్ మార్క్ ను చేరుకోనుంది. ఈ చిత్రానికి మోహ‌న్ రాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : వెట్రిమార‌న్ కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!