Mehbooba Mufti : గులాం నబీ ఆజాద్ పై మెహబూబా కన్నెర్ర
ఆర్టికల్ 370ని పునరిద్దరించవచ్చు
Mehbooba Mufti : ఆర్టికల్ 370ని పునరుద్దరించడం ఇప్పట్లో సాధ్యం కాదని, మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలని కామెంట్స్ చేసిన గులాం నబీ ఆజాద్ పై నిప్పులు చెరిగారు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti).
ప్రజలను మభ్య పెట్టేందుకు అలా మాట్లాడారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370ని పునరుద్దరించడం సాధ్యమేనని పేర్కొన్నారు ముఫ్తీ. దానిని తిరిగి పునరుద్దరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆజాద్ ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఇలా మాట్లాడారో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మెహబూబా ముఫ్తీ. కేంద్ర పాలిత ప్రాంతంలో దాని పునరుద్దరణ చేసేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ది కోసం ఆర్టికల్ 370ని రద్దు చేశారంటూ ముఫ్తీ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఆజాద్ కి భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు. బీజేపీకి వేరే అభిప్రాయం ఉండవచచు. నేనేం చేయగలను. కానీ మా అభిప్రాయంపై గట్టిగా ఉన్నామని స్పష్టం చేశారు.
గత నెలలో కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad). ఆయన 50 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రిగా, మాజీ సీఎంగా పని చేశారు.
10 రోజుల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం చేపడుతున్నారు. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : భారత అటార్నీ జనరల్ గా ముకుల్ రోహత్గీ