SS Rajamouli Viral : మేరా భార‌త్ మ‌హాన్..జై హింద్

ఈ విజ‌యం మ‌హిళ‌ల‌కు అంకితం

SS Rajamouli Viral : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నా భార‌త దేశం గొప్ప‌ద‌ని అని పేర్కొన్నారు. అమెరికాలోని ఫిలిం క్రిటిక్స్ అవార్డు ప్ర‌ధానోత్స‌వం సంద‌ర్బంగా రాజ‌మౌళి ప్ర‌సంగించారు. ఆయ‌న మాట్లాడిన స్పీచ్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. సినీ రంగానికి చెందిన అలియా భ‌ట్ , వ‌రుణ్ ధావ‌న్ , మ‌లైకా అరోరా, స‌మంతా రూత్ ప్ర‌భు, అన‌న్య పాండే రాజ‌మౌళిని(SS Rajamouli) అభినందించారు.

ఆర్ఆర్ఆర్ అవార్డుల‌ను గెలుచుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రాజ‌మౌళి ఆక‌ట్టుకునే ప్ర‌సంగంపై అభిమానులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. కంగ‌నా రనౌత్ కూడా స్పందించింది. ఉత్త‌మ విదేశీ భాషా చిత్రంగా పుర‌స్కారం అందుకున్న సంద‌ర్బంగా రాజ‌మౌళి ప్ర‌సంగించారు. నా విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం మ‌హిళ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు.

జై హిందీతో ప్రారంభించాడు. నా జీవితంలోని మ‌హిళ‌లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా త‌ల్లి రాజ‌నందిని గురించి చెప్పాలి. ఆమె పాఠ‌శాల విద్య‌ను ఎక్కువ‌గా అంచ‌నా వేసింది. న‌న్ను కామిక్స్ , క‌థ‌ల పుస్త‌కాలు చ‌ద‌వ‌మ‌ని ప్రోత్స‌హించింది. ఒక ర‌కంగా నాలోని క్రియేటివిటీని ప్రోత్స‌హించింద‌ని కొనియాడారు. నాకు త‌ల్లిలా మారిన మా కోడ‌లు శ్రీ‌వ‌ల్లి , న‌న్ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించే భార్య ర‌మ‌ను మ‌రిచి పోలేన‌ని అన్నారు రాజ‌మౌళి(SS Rajamouli). మేరా భార‌త్ మ‌హాన్..జై హింద్ అని ముగించారు.

ఒక స్థాయికి రావాలంటే చాలా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంది. ఇందులో నేను మిన‌హాయింపు ఏమీ కాద‌న్నారు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఇదే క్ర‌మంలో నేను ఇన్ని అడుగులు దాటి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌హిళ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు మ‌రోసారి ద‌ర్శ‌క ధీరుడు.

Also Read : రాజ‌మౌళికి కామెరూన్ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!