Jos Butler Bouncer : మెరిడిత్ బౌన్స‌ర్ త‌ప్పించుకున్న బ‌ట్ల‌ర్

లేక పోతే ఆస్ప‌త్రి పాలయ్యే చాన్స్

Jos Butler  : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో మోస్ట్ పాపుల‌ర్ స్టార్ హిట్ట‌ర్ గా పేరొందాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler ). టోర్నీలో ఆరెంజ్ క్యాప్ అవార్డు రేసులో టాప్ వ‌న్ లో ఉన్నాడు.

ఏకంగా మూడు షాన్ దార్ సెంచ‌రీస్ కొట్టాడు. ఆపై హాఫ్ సెంచ‌రీలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler )570 ప‌రుగుల దాకా చేశాడు. టాప్ వ‌న్ లో ఉన్నాడు.

ఇదిలా ఉండ‌గా లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో మ్యాచ్ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో బ‌ట్ల‌ర్ 67 ప‌రుగులు చేశాడు. ఇదే క్ర‌మంలో ముంబై బౌల‌ర్ మెరిడిత్ బౌన్స‌ర్ వేశాడు.

కొద్ది లో గాయం నుంచి త‌ప్పించుకున్నాడు జోస్ బ‌ట్ల‌ర్. ఇన్నింగ్స్ 6వ ఓవ‌ర్ లో మెరిడిత్ బంతిని వేశాడు. ఐదో బాల్ షార్ట్ బౌన్స‌ర్ వేశాడు. అయితే ఫుల్ జోష్ మీదున్న జోస్ బ‌ట్ల‌ర్ ఫుల్ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు.

కాగా ఆ బంతి నేరుగా వ‌చ్చి హెల్మెట్ ను బ‌లంగా తాకింది. విప‌రీత‌మైన స్పీడ్ తో వ‌చ్చిన ఆ బంతి దెబ్బ‌కు ఒక్క‌సారిగా త‌ల ప‌ట్టేసిన‌ట్లు అయ్యింది. దీంతో అంపైర్లు కొద్ది సేపు ఆపారు బౌల‌ర్ ను. హుటా హుటిన ఫిజియో థెర‌పిస్ట్ మైదానంలోకి వ‌చ్చాడు .

జోస్ బ‌ట్ల‌ర్ ను చూశాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బ్యాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఒక వేళ హెల్మెట్ ముందు భాగంలో త‌గిలి ఉన్న‌ట్ల‌యితే పెద్ద ప్ర‌మాదం చోటు చేసుకుని ఉండేది.

Also Read : సంజూ శాంస‌న్ ఇలాగేనా ఆడేది

Leave A Reply

Your Email Id will not be published!