PM Modi Messi : మెస్సీ మ్యాజిక్ మోదీ మెస్మరైజ్
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా
PM Modi Messi : ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గెలుపొందడంతో ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ స్పందించారు.
విశ్వ విజేతగా నిలిచిన అర్జెంటీనాను అభినందించారు. అంతకంటే ఎక్కువగా ఆ జట్టును విజయ తీరాలకు చేర్చడమే కాకుండా కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచారంటూ స్కిప్పర్ లియోనెల్ మెస్సీని ప్రశంసలు కురిపించారు. 35 ఏళ్ల మెస్సీ చిన్న తనంలో ఎన్నో కష్టాలు అనుభవించాడని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు(PM Modi Messi).
ఇలాంటి మ్యాచ్ లు అరుదుగా చూసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి. ట్విట్టర్ వేదికగా మెస్సీకి శుభాభినందనలు తెలిపారు. అత్యంత థ్రిల్లింగ్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఈ ఫైనల్ మ్యాచ్ మిగిలి పోతుందని స్పష్టం చేశారు మోదీ. ఈ టోర్నీలో మెస్సీ చేసిన మ్యాజిక్ తనను ఎంతగానో మెస్మరైజ్ చేసిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యే సరికి ఇరు జట్లు సమానంగా నిలిచాయి. అయినా ఆట సమయం పెంచినా ఇరు జట్లు సరి సమానంగా గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్ నిర్ణయించారు. దీంతో అర్జెంటీనా 4 గోల్స్ చేస్తే ఫ్రాన్స్ 2 గోల్స్ తో సరి పెట్టుకుంది. ఈ టోర్నీ నుంచి మెస్సీ తన ఆట నుంచి వైదొలగనున్నాడు.
Also Read : మూడుసార్లు విశ్వ విజేత అర్జెంటీనా