Rain Alert : ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్..
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి...
Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ – ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు (బుధవారం) తుఫాను(Toofan)గా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP Rain Alert
తుఫాను తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు పది నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. మత్య్సకారులు వేటకు వెళ్లారాదని వాతవారణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చేపలు వేటకు వెళ్లిన మత్య్సకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు(Rain Alert) పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంద్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు… ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (సోమవారం) రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి – ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల – కనగానపల్లి, తగరకుంట – కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పంట నష్టంపై అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఉప్పరపల్లి సమీపంలో వరదలో మునిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు.
Also Read : Minister Komatireddy : మాజీ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తిన మంత్రి కోమటిరెడ్డి