MI vs LSG IPL 2023 Eliminator : ముంబై జోర్దార్ ల‌క్నో బేజార్

81 ప‌రుగుల తేడాతో విజ‌యం

MI vs LSG IPL 2023 Eliminator : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపింది రోహిత్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్(MI) . ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. 81 ప‌రుగుల భారీ తేడాతో లోక్నో సూప‌ర్ జెయింట్స్(LSG) ను ఇంటికి పంపించింది. ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. టోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన ల‌క్నో కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 182 ర‌న్స్ చేసింది. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 16.3 ఓవ‌ర్ల‌లో 101 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ముంబైకి చెందిన బౌల‌ర్ ఆకాశ్ మ‌ధ్వాల్ చెల‌రేగి పోయాడు. నిప్పులు చెరిగే బంతుల్ని విసిరాడు. కేవ‌లం 5 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు మ‌ధ్వాల్. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు.

ముంబై ప‌రంగా చూస్తే కామెరూన్ గ్రీన్ 23 బంతులు ఆడి 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 ర‌న్స్ చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ 20 బంతులు ఆడి 2 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 33 ప‌రుగులు చేశాడు. తిల‌క్ వ‌ర్మ 22 బంతులు ఆడి 2 సిక్స్ ల‌తో 22 ర‌న్స్ చేశాడు. ఇషాన్ కిష‌న్ 15 చేస్తే రోహిత్ శ‌ర్మ 11 , డేవిడ్ 13 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో హ‌క్ 4 , ఠాకూర్ 3 వికెట్లు తీస్తే మోసిన్ ఖాన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక ల‌క్నో జ‌ట్టులో స్టాయినిస్ ఒక్క‌డే రాణించాడు. 40 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. మేయ‌ర్స్ 18, హూడా 15 ర‌న్స్ మాత్ర‌మే చేశారు.

Also Read : MS Dhoni Comment

 

Leave A Reply

Your Email Id will not be published!