Mi vs RCB IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై. ఇప్పటికే ఓ వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది.
సీఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 154 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్(Mi vs RCB IPL 2022) స్లోగా ఆడుతోంది. ఇదిలా ఉండగా ఇవాళ మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమవుతున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ .
హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది ఆర్సీబీ. ఇప్పటి వరకు కొన్నేళ్ల పాటు ఆ జట్టుకు స్కిప్పర్ గా ఉన్న కోహ్లీ తప్పు కోవడంతో అతడి స్థానంలో డుప్లెసిస్ కు బాధ్యతలు అప్పగించింది.
ఇక ఐపీఎల్ టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పరువు నిలబెట్టుకునేందుకు పాకులాడుతోంది. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు.
ప్రస్తుతం పుణె లోని ఎంసీఏ స్టేడియం వేదికగా బెంగళూరు, ముంబై (Mi vs RCB IPL 2022)తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉండగా ఇరు జట్లు మూడు మ్యాచ్ లు ఆడాయి. మూడింట్లోను ఓటమి మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్ .
ఇక ఆర్సీబీ అయితే మూడు మ్యాచ్ లు ఆడి రెండింట్లో గెలుపొందింది. ఒకటి ఓడి పోయింది. గతంలో ఆడిన మ్యాచ్ ల పరంగా చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో ట్రాక్ రికార్డు ముంబై వైపే ఉంది.
కానీ మైదానంలోకి దిగాక గానీ ఎవరు విజేత అనేది తేలుతుంది. ఇప్పటి వరకు 29 మ్యాచ్ లు ఆడితే 17 మ్యాచ్ లలో ముంబై జయకేతనం ఎగుర వేసింది.
Also Read : రిషబ్ పంత్ పై వీరూ కామెంట్స్