Owaisi Modi : అగ్నిపథ్ స్కీం వెనక్కి తీసుకోండి – ఓవైసీ
యువకుల జీవితాలతో ఆడుకోకండి
Owaisi Modi : కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం పై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. నిరసనలు, ఆందోళనలు, దాడులు, కేసులు, అరెస్ట్ లు, విధ్వంసాల పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. కాంగ్రెస్ సత్యా గ్రహ దీక్ష చేపట్టింది.
ఆందోళనకారులకు మద్దతు తెలిపింది. కానీ శాంతియుతంగా చేయాలని పిలుపునిచ్చింది. ఈ తరుణంలో ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ ఓవైసీ(Owaisi Modi) షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆదివారం ఎంపీ స్పందించారు. బేషరతుగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం వెనక్కి తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని, వారిని నిరాశకు గురి చేయవద్దని కోరారు.
సాయుధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న తరుణంలో ఓవైసీ(Owaisi Modi) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
అగ్ని పథ్ స్కీం కాదని అది మోస పూరితమైన పథకమని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ. వెంటనే దీనిని ఆపండి మోదీజీ. ముందు యువకులు ఏం చెబుతున్నారో వినండి.
కాంట్రాక్టు రిక్రూట్ మెంట్ కు సంబంధించి ఈ క్రూరమైన పథకాన్ని తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు ఓవైసీ. తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ఇది పూర్తిగా రాజకీయ పరమైన దురుద్దేశం దాగి ఉందన్నారు. సైన్యంలో ఇప్పటికే లక్ష మంది సైన్యం కొరత నెలకొని ఉంది. ఈ తరుణంలో కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా భర్తీ చేయాలని అనుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఓవైసీ.
Also Read : అగ్నిపథ్ స్కీం వెనక్కి తీసుకోవాలి – ప్రియాంక