Minister Komatireddy : అకస్మాత్తుగా సెక్రెటరైట్ లో తనిఖీలు చేపట్టిన మంత్రి కోమటిరెడ్డి
11 అయింది ఇంకా రాలేదు... మళ్లీ 6 గంటలకు వెళ్ళిపోతారు....
Minister Komatireddy : ఆర్ అండ్ బీ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్న మంత్రి.. పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆర్ అండ్ బీ విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఖాళీ కుర్చీలే కనిపించాయి. సమయం దాటినా చాలా మంది సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంపై మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధిగా ఉదయం 10 గంటలకు కార్యాలయానికి హాజరుకావాలి. అయితే ఉదయం 11గంటలు దాటినా సచివాలయ సిబ్బంది రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
Minister Komatireddy Visit
11 అయింది ఇంకా రాలేదు… మళ్లీ 6 గంటలకు వెళ్ళిపోతారు. అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇంకా పలు వివరాలను మంత్రి కోమటిరెడ్డి వారిని ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో.. ‘మీ డేటా మీకు తెలుసా?’ అంటూ గ్రిల్ చేశాడు. మరియు భవిష్యత్తులో ఉద్యోగులు సమయపాలన పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read : Polavaram Project : పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన