Minister Konda Surekha : కేటీఆర్ వల్లనే నాగ చైతన్య, సమంత విడిపోయారు

ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు...

Konda Surekha : మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం.

ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. హరీశ్ రావు మనస్సున మనిషిగా స్పందించారు. నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు”అని సురేఖ(Konda Surekha) అన్నారు.

Konda Surekha Slams..

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే.. దాన్ని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అసభ్యకరంగా ట్రోల్‌ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్‌ చూసి గడిచిన రెండ్రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్‌(KTR), హరీశ్‌రావు ఇంట్లో ఆడవాళ్లపైనా ఇలాంటి ట్రోలింగ్‌ చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్‌రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్‌ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులో డీపీ హరీశ్‌రావుది ఉందన్నారు. తనపైన జరిగిన ట్రోలింగ్‌కు హరీశ్‌, కేటీఆర్‌లు క్షమాపణ చెప్పాలన్నారు.

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇకపైన ఇలా ట్రోలింగ్‌లు చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌ బట్టలు విప్పించి బజారున ఉరికిస్తరని హెచ్చరించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టుపైన సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు. కాగా.. మీడియా సమావేశం ముగిసేలోపు సురేఖ(Konda Surekha) పలుమార్లు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలపైన సోషల్‌ మీడియా ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేస్తున్నారని, ఈ వర్గాలు కన్నెర్ర చేస్తే వారెక్కడుంటారని ప్రశ్నించారు.

సురేఖపై పోస్టులను కేటీఆర్‌ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కాగా, కొండా సురేఖపై ట్రోలింగ్‌లను నిరసిస్తూ తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ భవన్‌ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కొండా సురేఖపై అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. మహిళలపై గౌరవించాలని హితవుపలికారు.

Also Read : CM Chandrababu : చెత్తపన్నుపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!