Minister KTR : అభివృద్ధికి చిరునామా తెలంగాణ

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR  : ఖ‌మ్మం జిల్లా – దేశం ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంద‌ని అన్నారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఖ‌మ్మం జిల్లా కొణిజర్ల మండ‌లంలో ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ఫ్యాక్ట‌రీకి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌సంగించారు.

ఇవాళ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, వ్యవ‌సాయ అనుబంధ రంగాల‌కు సంబంధించిన పరిశ్ర‌మ‌లు హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రంలో కొలువు తీరాయ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపు కార‌ణంగా రాష్ట్రం అన్ని రంగాల‌లో ముందంజ‌లో కొన‌సాగుతోంద‌న్నారు.

Minister KTR Comment

ఓ వైపు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా ముందుకు వెళుతున్నామ‌ని , ఐటీ ప‌రంగా ఇవాళ ఇండియాలోనే తెలంగాణ టాప్ లో ఉంద‌ని చెప్పారు మంత్రి కేటీఆర్(Minister KTR ). విద్య‌, వైద్య , ఉపాధి రంగాల‌పై ఎక్కువ‌గా త‌మ ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింద‌న్నారు.

అంతే కాకుండా ప్ర‌తి జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల స్థాయిలలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని తెలిపారు కేటీఆర్. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఇతోధికంగా సాయం చేస్తోంద‌న్నారు.

కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని త‌మ స‌ర్కార్ పై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ వారి ఆట‌లు సాగ‌వ‌న్నారు. వారు చెప్పే మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాబోయే కాలంలో కూడా తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌న్నారు.

Also Read : Alishetty Prabhakar : అలిశెట్టి కుటుంబానికి ఆస‌రా

Leave A Reply

Your Email Id will not be published!