KTR PM Modi : తెలంగాణ కంటే గొప్ప రాష్ట్రం చూపండి
మోదీ కామెంట్స్ కేటీఆర్ సీరియస్
KTR PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్(KTR PM Modi). దేశానికి ఆదర్శ ప్రాయంగా తెలంగాణ ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం టాప్ లో ఉందన్నారు. ఐటీ పరంగా తమ రాష్ట్రం టాప్ లో ఉన్నా ఎందుకని ప్రశంసించ లేక పోయారంటూ మోదీని ప్రశ్నించారు. చవకబారు విమర్శలు చేయడం తగదని సూచించారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు కేటీఆర్.
తమ రాష్ట్రం కంటే మెరుగైన అభివృద్దిని సాధించిన రాష్ట్రం ఏదైనా ఉంటే బహిరంగంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మంత్రి. ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ప్రధానికి సవాల్ విసిరారు. వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తించడంలో మోదీ విఫలమం అయ్యారంటూ ఆరోపించారు.
గత తొమ్మిది ఏళ్ల కాలంలో దేశంలో ఏం జరిగిందో తమ రాష్ట్రంలో ఏం జరిగిందో చూడాలన్నారు కేటీఆర్. తెలంగాణ అన్ని రంగాలలో టాప్ లో ఉంది. దేశంలో అత్యధిక తలసరి వృద్ది కలిగిన రాష్ట్రంగా ఉందన్నారు.
అన్ని ఇళ్లకు తాగు నీరు అందించామని, ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు కేటీఆర్. ఉత్తమ గ్రామీణ అభివృద్దికి నమూనాగా తెలంగాణ ఉందన్నారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. అత్యధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నది తామేనని పేర్కొన్నారు కేటీఆర్(KTR).
Also Read : వేషం మార్చినా నీడ అలాగే ఉంది