Minister KTR : బోటు నడిపిన కేటీఆర్
సిరిసిల్లలో అరుదైన దృశ్యం
Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ హల్ చల్ చేశారు. ఆయన అందరినీ ఆశ్చర్య పరిచారు. తాను కూడా బోటు నడిపి విస్తు పోయేలా చేశారు. ఈ సంఘటన శుక్రవారం సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బోటును మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రారంభించారు. ఈ సందర్బంగా తానే నడిపారు. ఆ బోటులో మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరికొందరు ఉన్నారు.
Minister KTR Inaugurated New Boats
విచిత్రం ఏమిటంటే మంత్రి కేటీఆర్ ఎక్కడా భయానికి గురి కాలేదు. తాను అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నానని ప్రూవ్ చేసుకున్నారు. తనకు ఎవరూ సాటి లేరని చాటి చెప్పారు. ఇప్పటికే తండ్రి సీఎం కేసీఆర్ కు తగ్గ తనయుడిగా ప్రూవ్ చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా 100 శాతం మార్కులు కొట్టేశారు.
ఐటీ పరంగా దేశంలోనే తెలంగాణను టాప్ లో నిలపడంలో కీలక పాత్ర పోషించారు. పూర్తిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు పొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ స్వయంగా మంత్రి తనే బోటు నడపడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతైనా కేటీఆరా మజాకా అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. రాబోయే రోజుల్లో సీఎం రేసులో కూడా ఉన్నారు.
Also Read : ST Somashekar Gowda : డీకే నా రాజకీయ గురువు – బీజేపీ ఎమ్మెల్యే