Minister KTR : సవాల్ గా మారిన పార్కింగ్ సమస్య
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్
Minister KTR : ఐటీ , పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రధానంగా ఆయన పార్కింగ్ సమస్యను ప్రస్తావించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టనాలలో ఉందన్నారు. దీనిని తాను అంగీకరిస్తున్నానని తెలిపారు.
Minister KTR Words
ఒక రకంగా చెప్పాలంటే అన్ని ప్రభుత్వాలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడం అన్నది పెను సవాల్ గా మారిందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్(KTR). ప్రస్తుతానికి ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చించడం జరుగుతోందన్నారు. ఇందుకు సంబంధించి పలుమార్లు రివ్యూ కూడా చేశానని తెలిపారు . నగరంలో పార్కింగ్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్.
తాము హైదరాబాద్ లో రెండు ఎంఎల్పీలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఇలాంటివి ఇంకా చాలా అవసరమన్నారు. కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలలో , పార్కింగ్ ప్రాంతాలతో పార్క్ అండ్ రైడ్ మోడ్ ను ఉపయోగించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు మంత్రి. అలాగే స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి పని చేసే ఖాళీ స్థలం , ప్లాట్ యజమానులు తమ ఆస్తిని పార్కింగ్ గా మార్చుకుని సాధారణ ఆదాయాన్ని పొందాలనే ఆలోచనను కూడా తాము పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : Jayasudha Changes Parties : నాలుగు పార్టీలు మారిన జయసుధ