Minister KTR : తమిళి సై తీరు బాధాకరం
ఎమ్మెల్సీల తిరస్కరణ పై ఫైర్
Minister KTR : హైదరాబాద్ – తమ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిన ఫైల్ ను తిప్పి పంపడం దారుణమన్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
Minister KTR Comments on Telangana Governer
యావత్ ప్రపంచం ప్రస్తుతం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. కానీ మోదీ మాత్రం నిత్యం తెలంగాణపై విషం చిమ్ముతున్నారని దీనిని ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే ఛాన్స్ ఉంటుందన్నారు.
ఫెడరల్ స్పూర్తితో వ్యవహరించాల్సిన గవర్నర్ పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ గా కాకుండా తమిళి సై సౌందర రాజన్ పూర్తిగా బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్.
ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణలను తిరస్కరించడం మంచి పద్దతి కాదన్నారు. వారికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఎన్నో సంస్థలలో పని చేసిన అనుభవం శ్రవణ్ కు ఉందని పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన తిరస్కరించారో చెప్పాలన్నారు మంత్రి.
Also Read : Bandi Sanjay : తాంత్రిక పూజలతో కేసీఆర్ బిజీ