Minister Lokesh : మంత్రిగా మొదటిసారి విశాఖకు చేరుకున్న ‘నారా లోకేష్’

అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పార్టీ కేడర్‌తో సమావేశం కానున్నారు...

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కీలక నేతలు ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా రాక్ డెల్‌లోని లే అవుట్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఈ రోజు రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేయనున్నారు. 29వ తేదీ ఉదయం సాక్షి కథనంపై ఆయన కోర్టుకు హాజరవుతారు.

Minister Lokesh Visit

అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పార్టీ కేడర్‌తో సమావేశం కానున్నారు. ఇక 30వ తేదీన జిల్లాలోని పలు పాఠశాలలను నారా లోకేశ్ సందర్శించనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్(Minister Lokesh) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జిల్లా ఉన్నతాధికారులతో సైతం ఆయన సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రి లేకుంటే ఆగస్ట్ 31వ తేదీ ఉదయం విశాఖపట్నం నుంచి రాజధాని అమరావతికి నారా లోకేశ్ పయనమవనున్నారు. తనపై అసత్య కథనాలను ప్రచురించిన సాక్షి దిన పత్రికపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Minister Lokesh) న్యాయ పోరాటానికి దిగారు. చిన‌బాబు చిరుతిండి.. రూ. 25 ల‌క్ష‌లండి పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన అస‌త్య క‌థ‌నంపై నారా లోకేష్ స్పందించారు. ఈ కథనంపై న్యాయ‌ పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. అందులోభాగంగా ఈ కథనంపై కోర్టులో మంత్రి నారా లోకేశ్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఆగస్ట్ 29వ తేదీన విశాఖపట్నం 12వ అదనపు జిల్లా కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజ‌రు కానున్నారు.

పక్కా అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌ పూర్వ‌కంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ కథనం వేశారంటూ నారా లోకేశ్(Minister Lokesh).. తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. సత్య దూరమైన ఈ వార్త కథనంపై సాక్షి దిన పత్రిక ఎటువంటి వివరణ వేయకపోవడంతోపాటు తాను జారీ చేసిన నోటీసులపై సైతం స్పందించక పోవడంతో మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన పరువునకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారంటూ మంత్రి నారా లోకేశ్.. కోర్టును ఆశ్రయించారు.

అలాగే ఈ కథనాల్లో స్పష్టం చేసినట్లు.. ఆ యా తేదీల్లో తాను విశాఖపట్నంలోనే లేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్ర‌తిష్ట‌ని మంట‌గ‌లిపేందుకు ప్ర‌య‌త్నించారంటూ ఈ సందర్భంగా నారా లోకేశ్.. కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. గతంలో తాను పలుమార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలను తాను స్వీకరించ లేదని కోర్టుకు నారా లోకేశ్ తెలిపారు. వివిధ కార‌ణాల‌తో గత కొద్ది రోజులుగా వాయిదాలు మీద వాయిదాలు పడిన ఈ కేసు రేపు.. అంటే ఆగస్ట్ 29వ తేదీన మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లుకానుంది.

Also Read : Karnataka Home Minister : కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వరన్ ను చుట్టుముట్టిన వివాదాలు

Leave A Reply

Your Email Id will not be published!