Minister Nadendla : రాబోయే రోజుల్లో ధాన్యం అమ్మిన సొమ్ము రైతులకు 48 గంటల్లో చెల్లిస్తాం

గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు...

Minister Nadendla : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంల్లో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్లు రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాల్లో 35 వేల 374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్(Minister Nadendla) మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లయిస్‌కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కారు నగదు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 వేల 724 మంది రైతులకు 1,674 కోట్లు రూపాయలు బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1000 కోట్లను రైతులకు పంపిణీకి ఏర్పాటు చేసిందన్నారు.

Minister Nadendla Comment

గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla) పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. రూ. 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత ప్రభుత్వం రుణాలు తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్ధికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోయాయన్నారు. కూటమి సర్కారు ఆధికారంలోకి వచ్చాక తాము ఫోన్ చేస్తుంటే బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారని మనోహర్ తెలిపారు. రైతులకు ఎక్కడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా పని చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో దళారులు స్వార్ధంతో రైతులను ఇబ్భంది పెట్టారని.. వ్యాపారవేత్తలే కాదు.. రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెయ్యాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టామని మనోహర్ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ము 48 గంటల్లో చెల్లిస్తామని మనోహర్ తెలిపారు. రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్లు అందజేస్తామన్నారు. రైతులు మిల్లర్లకు, దళారులకు, వ్యాపారవేత్తలకు భయపడాల్సిన పని లేదన్నారు. గతంలో రైతులకు ఇబ్బందులు కలిగించడానికి ధాన్యం కొనుగోలులో మిల్లుల చుట్టూ తిప్పారన్నారు. కంప్యూటర్ ఇచ్చిన చీటీల వలనే అలా జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారన్నారు. కానీ అవి కంప్యూటర్ చీటీలు కాదని.. మిమ్మల్ని ఇబ్భంది పెట్టడానికి వైసీపీ చేసిన కుట్ర అని పేర్కొన్నారు. బ్యాంకులకు ఫౌర సరఫరాల సంస్థ చెల్లించాల్సిన బకాయిల్లో మార్చి 30వ తేదీనాటికి 10 వేల కోట్ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందన్నారు. రైతులకు పంట బీమా ప్రీమియంను ఉచితంగా ప్రభుత్వమే చెల్లించేలా యోచన ఉందన్నారు.

Also Read : CM Revanth Reddy : యువత రాణించేలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం

Leave A Reply

Your Email Id will not be published!