Minister Ponnam : పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని కీలక సూచనలిచ్చిన మంత్రి

మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. భావి సమాజాన్ని మనమంతా కాపాడుకుందామని పిలుపునిచ్చారు...

Minister Ponnam : పౌరులందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని బీసీ రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నేడు (బుధవారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో మొక్కలు నాటారు. భావి తరాల ఆరోగ్యం కోసం ప్రతి పౌరుడు విధిగా ఒక మొక్కను నాటాలన్నారు.

Minister Ponnam Comment

మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. భావి సమాజాన్ని మనమంతా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పిల్లలకు ప్రతిరోజూ మొక్కలకు నీరు పెట్టడం నేర్పించాలి. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం కూడా మనల్ని కాపాడుతుంది. పర్యావరణానికి హాని కలిగించే విధంగా చెట్లను నరికివేయవద్దని కోరారు. మొక్కలు నాటకుంటే ప్లాస్టిక్ వాడకం పెరిగి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయిందని, క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. రాష్ట్రాన్ని పర్యావరణహితంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Also Read : Rain Alert : ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!