Minister Satyakumar : మంచి విద్య, వైద్యం అందించాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి

13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయి ఆసుపత్రి యాజమాన్యాలు...

Minister Satyakumar : గత ప్రభుత్వంలో రూ.8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉందని… కానీ రూ.2120 కోట్లు మాత్రమే ఖర్చు చేరాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) అన్నారు. దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు. వైద్యవిద్య అందించాలంటే ప్రమాణాలుంటాయని.. అవి పాటించకుండా చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టే అని అన్నారు. వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దీనిపై అవగాహన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 12 కళాశాలలో రాబోయే ఏడాదికి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామన్నారు. రూ.10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పుపెట్టివెళ్లిందన్నారు. ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మీద ముందుగానే అప్పు చేసిన ఘనత జగన్ దే అంటూ వ్యాఖ్యలు చేశారు.

Minister Satyakumar Yadav Comment

13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయి ఆసుపత్రి యాజమాన్యాలు. గత ప్రభుత్వం రూ.2500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లింది… ఇప్పటి వరకు రూ.652 కోట్లు తాము బకాయిలు చెల్లించామని తెలిపారు. వచ్చిన మూడు నెలల్తోనే వేలాది కోట్లు బకాయిలు చెల్లించడం భారమే.. కానీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. సదరన్ సర్టిఫికెట్ల అంశంలో సర్వే జరుగుతుందని… తప్పుడు సర్టిఫికేట్లు పెట్టిన వారి పించన్‌లు తొలగిస్తామన్నారు. ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తేలితే వైద్యులపైన చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

Also Read : Harish Rao : ప్రైవేట్ టీచర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్

Leave A Reply

Your Email Id will not be published!