Minister Uttam Kumar : కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం

కేసిఆర్ హయాంలో విద్యవ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు...

Minister Uttam Kumar : కాంగ్రెస్ హయాంలోనే విద్యావ్యవస్థ పటిష్టమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ (శుక్రవారం) చిలుకూరు మండలం సీతారామపురంలో రూ.300 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూలుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar), తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శంకుస్థాపన చేశారు. అలాగే దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ…తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Minister Uttam Kumar Reddy Comments

కేసిఆర్ హయాంలో విద్యవ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయమనే నినాదంతో ముందుకు కొనసాగుతున్నామని అన్నారు. ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడంలో భాగంగానే 800 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈ సంవత్సర కాలంలో ఇరిగేషన్, విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : CM Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్ చేయడానికి అందరూ ముందుకు రావాలి

Leave A Reply

Your Email Id will not be published!