Arshdeep Singh : అర్ష్ దీప్ సింగ్ కు మంత్రి మ‌ద్ద‌తు

సోష‌ల్ మీడియాలో పేస‌ర్ పై ఫైర్

Arshdeep Singh :  ఆసియా క‌ప్ -2022లో భాగంగా సూప‌ర్ -4 సంద‌ర్భంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు భార‌త జ‌ట్టుపై గెలుపొందింది. బౌల‌ర్ల నిర్వాకం, ఫీల్డింగ్ లో చోటు చేసుకున్న నిర్ల‌క్ష్యం జ‌ట్టు పాలిట శాపంగా మారింది.

ఈ మ్యాచ్ లో ప్ర‌ధానంగా అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) క్యాచ్ వ‌దిలి వేశాడు. దీంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. నెట్టింట్లో విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు స‌ర్దార్జీలు. మ్యాచ్ అన్నాక పొర‌పాట్లు జ‌రుగుతుంటాయ‌ని వీటిని సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు విరాట్ కోహ్లీ.

తాజాగా పంజాబ్ విద్యా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ అర్ష్ దీప్ సింగ్ త‌ల్లికి సంఘీభావం ప్ర‌క‌టించారు. మంత్రితో పాటు పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా అర్ష్ దీప్ సింగ్ కు సంపూర్ణ మ‌ద్ధ‌తు తెలిపారు.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో కీల‌క బంతిని వ‌దిలి వేయ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నాడు. ఇదిలా ఉండ‌గా అర్ష్ దీప్ సింగ్ ది పంజాబ్ లోని మొహాలీ.

24 ఏళ్ల మీడియం పేస‌ర్. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నాడు. అత‌డి వ‌ల్ల‌నే మ్యాచ్ ఓట‌మి చెందిందంటూ మండిప‌డుతున్నారు.

దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ప్ర‌స్తుత ఆప్ మంత్రి, మాజీ సీఎం. ఈ సంద‌ర్భంగా అర్ష్ దీప్ త‌ల్లికి ఓదార్పు ఇచ్చేలా చేశారు మంత్రి.

డెత్ ఓవ‌ర్ల‌లో మీకు బంతిని ఇస్తే అద్భుత బౌల‌ర్ అని అర్థం. విజ‌యం ఎవ‌రి చేతుల్లో ఉండ‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రు తెలుసు కోవాలి. ఎవ‌రు జ‌ట్టుకు ఆడినా దేశం కోసం ఆడ‌తార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : కంట్రోల్ చేసుకోక పోతే ఎలా కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!