Mirabai Chanu : వెయిట్ లిఫ్టింగ్ లో చానుకు బంగారు పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో సత్తా చాటిన భారత్
Mirabai Chanu : బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 49 కేజీల విభాగంలో మీరా బాయి చాను బంగారు పతకాన్ని గెలుచుకుంది.
చరిత్ర సృష్టించింది. తాను ఎలాగైనా సరే ఈసారి గేమ్స్ లో తప్పక స్వర్ణ పతకాన్ని సాధిస్తానని శపథం చేసింది. దీంతో ఈ ఏడాది క్రీడల్లో భారత దేశానికి మొదటి పతకాన్ని సాధించి పెట్టింది.
దీంతో యావత్ భారతమంతా సంతోషంతో ఉప్పొంగి పోతోంది. 201 కిలోల బరువును ఎత్తి ఎల్లో మెటల్ ను గెలుచుకుంది. అంతకు ముందు సంకేత్ సర్గర్ ఇదే వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని తృటిలో తప్పి పోయాడు.
దీంతో సిల్వర్ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. భుజానికి గాయం కావడంతో తాను పతకాన్ని కోల్పోవడం జరిగిందంటూ బాధను వ్యక్తం చేశాడు సర్గర్. మరో క్రీడాకారుడు గురు రాజా కాంస్య పతకం సాధించాడు.
ఇక స్నాచ్ రౌండ్ లో మీరా బాయి చాను(Mirabai Chanu) అద్భుతమైన ప్రదర్శన చేసింది. అంతకు ముందు ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 2018 సిడబ్ల్యూజిలో బంగారు పతకాన్ని సాధించింది చాను.
స్నాచ్ లో 88 కిలోలు , క్లీన్ అండ్ జర్క్ లో 113 కిలోలు అందు కోవడంతో పోటీకి మైళ్ల దూరంలో ముందుంది. కామన్వెల్త్ గేమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది మీరాబాయి చాను. 105 కిలోల బరువును ఎత్తుకుని చరిత్ర సృష్టించింది.
ఈ ఈవెంట్ లో మారిషస్ కు చెందిన రోయిలియా రణైవోసోవా రజత పతకం సాధించగా కెనడాకు చెందిన హన్నా కమిన్సీ కాంస్య పతకాన్ని పొందింది.
Also Read : రజత పతక విజేత సంకేత్ సర్గర్