Miss Argentina Viral : ఒక్కటైన మిస్ అర్జెంటీనా..వాలెంటిన్
పెళ్లి చేసుకున్నామంటూ ప్రకటన
Miss Argentina Viral : లోకం మారిపోతోంది. ప్రధానంగా లెస్బియన్లు తమను తాము స్వేచ్ఛగా జీవించే హక్కును కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎల్జీబీటీగా ఏర్పాటై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇది కాస్తా వైరల్ అవుతోంది. స్టేటస్ సింబల్ గా మారి పోయింది. ఒకప్పుడు వీటిపై నిషేధం ఉండేది.
కానీ గతంలో లేనంతగా టెక్నాలజీ మారుతోంది. దీంతో పాటు సంప్రదాయాలు, కట్టుబాట్లు ఒక్కటొక్కటిగా వీడి పోతున్నాయి. తాజాగా మిస్ అర్జెంటీనా మరియానా వరెలా మిస్ ప్యూర్టో రికో ఫాబియోలా వాలెంటీన్(Miss Argentina Viral) ఒక్కటయ్యారు. తాము పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇద్దరు ముద్దుగుమ్మలు తమ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో కలిసి పోటీ చేశారు. మిస్ అర్జెంటీనాగా నిలిస్తే మరొకరు మాజీ మిస్ గా ఉన్నారు. వీరిద్దరికీ ఆనాటి నుంచే పరిచయం పెరిగింది.
అది స్నేహంగా విడదీయలేని బంధంగా చివరకు వివాహం చేసుకునేంత దాకా వెళ్లింది. 2020లో పోటీ చేసిన అర్జెంటీనాకు చెందిన మరియానా వరెలా , ప్యూర్టో రికోకు చెందిన ఫాబియోలా వాలంటెన్ అక్టోబర్ 28న రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు.
వరెలా 2019లో మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీలో గెలుపొందింది. ఆ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ప్యూర్టో రికో పోటీల్లో వాలెంటిన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక 2020లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో వారిద్దరూ టాప్ 10లో చేరారు.
Also Read : రాహుల్ గాంధీ యాత్రలో పూజా భట్