Ratan Tata : మిస్త్రీ మరణం టాటా ప్రకటించని సంతాపం
ఇద్దరి మధ్య ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి
Ratan Tata : భారతీయ వ్యాపార దిగ్గజాలలో రతన్ టాటా ఒకరు. టాటా సన్స్ కు చైర్మన్ గా పని చేశారు 54 ఏళ్ల సైరస్ మిస్త్రీ. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా కారు డివైడర్ ను ఢీకొట్టి దుర్మరణం చెందాడు. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం ముంబైలో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. కానీ రతన్ టాటా(Ratan Tata) నుంచి ఎలాంటి సంతాపం ప్రకటించక పోవడం వ్యాపార వర్గాలలో చర్చకు దారి తీసింది.
ఇద్దరి మధ్య కొంత కాలం పాటు అంతరం ఏర్పడింది. టాటా మిస్త్రీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కానీ అతనితో తీవ్ర న్యాయ పోరాటానికి దిగాడు. టాటా సన్స్ మాజీ చైర్మన్ మరణం కార్పొరేట్ ఇండియాను విస్తు పోయేలా చేసింది.
ఇద్దరి మధ్య చాలా ద్వేషాలు ఉన్నాయని, వారు ఎప్పటికీ సయోధ్య కుదరలేదని సైరస్ మిస్త్రీ సన్నిహితుడు ఒకరు పేర్కొన్నారు. మిస్త్రీ ఆధ్వర్యంలోని టాటాలకు బ్రాండ్ మేనేజర్ గా ఉన్న ముకుంద్రాజన్ ఒక ప్రత్యేకమైన ఇంటర్యూలో మాట్లాడారు.
రతన్ టాటా పాత విభేదాలను మరిచి పోయే సమయం ఆసన్నమైందన్నారు. మిస్త్రీ మృతికి సంతాపం తెలుపుతూ టాటా బహిరంగ ప్రకటన విడుదల చేయక పోవడం వింతగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు.
ప్రతి వ్యక్తి వారి స్వంత ఎంపికలు చేసుకుంటారు. మీడియాలో ఇతరత్రా కొన్ని కోర్టులో దాఖలైన ఆరోపణలతో టాటా చాలా బాధ పడ్డారు. గతం పక్కన పెట్టి టాటా సంతాపం తెలిపి ఉంటే బావుడేందన్నారు.
Also Read : అర్ష్ దీప్ సింగ్ దేశానికి గర్వకారణం