Mitchell Marsh : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆది లోనే వికెట్ కోల్పోయినా వరల్డ్ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ప్రధానంగా మిచెల్ మార్ష్ అయితే రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మార్ష్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) 62 బంతులు ఆడి 89 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 41 బంతులు ఆడి 52 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నారు.
వీరిద్దరూ రెండో వికెట్ కు 144 రన్స్ చేశారు. ఇక మార్ష్ పూర్తి పేరు మిచెల్ రాస్ మార్ష్ . 20 అక్టోబర్ 1991లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని అట్టడలేలో పుట్టాడు. వయసు 30 ఏళ్లు. మారు పేరు బైసన్.
కుడి చేతి వాటం బ్యాటర్. రైడ్ ఆర్మ్ పేసర్. ఓవర్ ఆల్ గా మిచెల్ మార్ష్(Mitchell Marsh) ఆల్ రౌండర్. 2011 నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. 22 అక్టోబర్ 2014లో పాకిస్తాన్ తో టెస్టు అరంగేట్రం చేశాడు.
19 అక్టోబర్ 2011న దక్షిణాఫ్రికాతో వన్డే జట్టుకు ఆడాడు. 16 అక్టోబర్ 2011న సఫారీతో టీ20 ప్రారంభించాడు మిచెల్ మార్ష్. ఐపీఎల్ లో 2010లో డెక్కన్ ఛార్జర్స్ కు , 2011 నుంచి 2013 వరకు పూణె వారియర్స్ ఇండియా కు ఆడాడు.
2016-17 వరకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ , 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మార్ష్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read : ఢిల్లీ క్యాపిటల్స్ షాన్ దార్ విక్టరీ