చెన్నై వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ సేనదే పై చేయిగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 27 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 167 రన్స్ చేసింది.
మరోసారి వీంద్ర జడేజా మెరిశాడు. తనదైన మార్క్ చూపించాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటాడు. కేవలం 16 బాల్స్ ఎదుర్కొని 21 రన్స్ చేశాడు. జడేజా కంటే ముందు శివమ్ దూబే 25 రన్స్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ 24, అంబటి రాయుడు 23, అజింక్యా రహానే 21 రన్స్ చేశారు. అంతే కాదు 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చుక్కలు చూపించారు చెన్న ఆటగాళ్లకి. తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. కానీ బ్యాటర్లు రాణించక పోవడంతో ఓటమి పాలయ్యారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఇక ఇదే జట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తన అద్భుతమైన బౌలింగ్ తో మరోసారి సత్తా చాటాడు. 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన 3 వికెట్లు తీశాడు.
