Mitchell Starc IPL : రూ. 23 కోట్లకు మిచెల్ స్టార్క్
ఐపీఎల్ అత్యధిక ధర
Mitchell Starc IPL : దుబాయ్ – ఐపీఎల్ 2024 వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మిచెల్ స్టార్క్(Mitchell Starc). అతడిని ఏకంగా రూ. 23 కోట్ల దర పలికాడు. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇక ఆసిస్ స్టార్ బౌలర్, కెప్టెన్ పాట్ కమిన్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. సిఇవో కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Mitchell Starc IPL Team
పాట్ కమిన్స్ ను రూ. 20.50 కోట్లు వెచ్చింది. డారిల్ మిచెల్ రూ. 14 కోట్లు పలికాడు ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. పాట్సెల్ రూ. 11.75 కోట్లకు అమ్ముడు పోయాడు. అల్జారీ జోష్ ను రూ. 11.50 కోట్లకు కైవసం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఇక హర్షల్ పటేల్ భారీ ధర పలికాడు. ఇతడిని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం రూ.11.75 కోట్లకు తీసుకుంది. శార్దూల్ ఠాకూర్ రూ. 4 కోట్లకు, రచిన్ రవీంద్ర రూ. 1.80 కోట్లకు తీసుకుంది సీఎస్కే.
రోవ్ మెన్ పావెల్ రూ. 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 6.80 కోట్లకు, హ్యారీ బ్రూక్ ను రూ. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా మొత్తం వేలం పాటలోకి 332 మంది ఆటగాళ్లు రాగా ఇందులో 77 మంది ఆటగాళ్లకు 10 ఫ్రాంచైజీలు రూ. 262 కోట్లు ఖర్చు చేశాయి.
Also Read : Harry Brook IPL 2024 : హ్యారీ బ్రూక్ ఫుల్ హ్యాపీ