ICC ODI Rankings : న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ను ఏడోసారి చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ లలో ఆ జట్టు ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నాయి.
మారథన్ ఇన్నింగ్స్ తో ఫైనల్ లో ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టిన స్టార్ ప్లేయర్ హీలీ అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్(ICC ODI Rankings) ప్రకటించింది.
ఏకంగా 170 పరుగులతో విరుచుకు పడిన హీలీ నెంబర్ వన్ గా నిలిచింది. ఏకంగా 785 రేటింగ్ పాయింట్స్ సాధించింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన మరో క్రికెటర్ బెత్ మూనీ 748 పాయింట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది.
మరో వైపు ఆసిస్ స్కిప్పర్ మెగ్ లాన్నింగ్ 710 పాయింట్లతో , రేచల్ హేన్స్ వరుసగా, 5,6 స్థానాలు పొందారు. ఇక ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ నథాలీ సీవర్ 750 పాయింట్లు సాధించి సత్తా చాటింది.
ఏకంగా రెండో ప్లేస్ దక్కించుకుంది. సఫారీ బ్యాటర్ లారా నాలుగో స్థానంలో నిలిచింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాద్ కు చెందిన స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ (ICC ODI Rankings)686 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
ఇక ఇదే ఇండియాకు చెందిన స్టార్ హిట్టర్ గా పేరొందిర స్మృతి మంధాన 669 పాయింట్లతో 9వ స్థానంతో సరి పెట్టుకుంది. దీంతో భారత్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వన్డే 10 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించు కోవడం విశేషం.
ఇదిలా ఉండగా ఐసీసీ ప్రకటించిన ఆల్ ఆఫ్ ఫేమ్ టీంలో మాత్రం ఇండియాకు చెందిన ఆటగాళ్లకు చోటు ఇవ్వలేదు.
Also Read : ఆర్సీబీకి షాక్..మ్యాచ్ కు ‘మాక్స్’ దూరం