Mithali Raj : వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు కెప్ట‌న్ గా మిథాలీ రాజ్

భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి వెల్ల‌డి

Mithali Raj : భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ 2022 తో పాటు న్యూజిలాండ్ సీరీస్ కోసం 15 మంది తో కూడిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఆసిస్ లో చివ‌రి ప‌రిమిత ఓవ‌ర్ల అసైన్ మెంట్ వ‌ర‌కు జ‌ట్టులో అంత‌ర్భాగంగా ఉన్న బ్యాట‌ర్ జెమిమా రోడ్రిగ్స్ ను త‌ప్పించింది. ఇక హైద‌రాబాదీకు చెందిన స్టార్ విమెన్ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్ (Mithali Raj) నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ డిప్యూటీగా నియ‌మించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. 2021లో ఫార్మాట్ల‌లో త‌న ఆల్ రౌండ్ నైపుణ్యాల‌తో ఆక‌ట్టుకున్న స్నేహ రాణా జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంది.

టీమిండియా త‌మొ మొద‌టి ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ను ఈ ఏడాది మార్చి 6న బే ఓవ‌ల్ తౌరంగ‌లో పాకిస్తాన్ తో త‌ల‌ప‌డ‌నుంది. అంతే కాకుండా ఫిబ్ర‌వ‌రి 11 నుంచి కీవీస్ తో ప్రారంభ‌య్యే 5 మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ లో కూడా ఇదే జ‌ట్టు ఆడ‌నుంది.

పాకిస్తాన్ త‌ర్వాత మార్చి 10న న్యూజిలాండ్ , 12న వెస్టిండీస్ తో, 16న ఇంగ్లండ్ తో , 19న ఆస్ట్రేలియాతో , 22న బంగ్లాదేశ్ తో , 27న ద‌క్షిణాఫ్రికాతో పోటీ ప‌డ‌నుంది. న్యూజిలాండ్ , ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ కు సంబంధించి జ‌ట్టు ఇలా ఉంది.

మిథాలీరాజ్ కెప్టెన్ కాగా, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు. స్మృతి మంధాన‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, యాస్తిక భాటియా, దీప్తి శ‌ర్మ‌, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్ ) , స్నేహ రాణా, ఝుల‌న్ గోస్వామి, పూజా వ‌స్త్రాక‌ర్ , మేఘ‌నా సింగ్ , రేణుకా సింగ్ ఠాకూర్ , తానియా భాటియా ( వికెట్ కీప‌ర్ ) , రాజేశ్వ‌రి గైక్వాడ్ , పూన‌మ్ యాద‌వ్ ఉన్నారు.

ఇక స్టాండ్ బై ప్లేయ‌ర్లుగా స‌బ్బినేని మేఘ‌న‌, ఏక్తా బిష్త్ , సిమ్రాన్ దిల్ బ‌హ‌దూర్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.

Also Read : ర్యాంకింగ్స్ లో ల‌బూషేన్..క‌మిన్స్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!