Mithali Raj : టి20 వరల్డ్ కప్ టీమిండియాదే – మిథాలీ రాజ్
మాజీ మహిళా జట్టు కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Mithali Raj : భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి నిష్క్రమించారు. తాజాగా మరో కొత్త కెరీర్ ను స్టార్ట్ చేశారు. క్రికెట్ కామెంటేటర్ గా ప్రారంభించారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ -12 లీగ్ లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ కు కామెంటరీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో అన్ని జట్ల కంటే భారత జట్టు మెరుగ్గా ఉందన్నారు. అంతే కాదు ఈసారి మెగా టైటిల్ ను తప్పక టీమిండియా కైవసం చేసుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు మిథాలీ రాజ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది భారత జట్టు.
పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై విజయాన్ని సాధించగా సఫారీ టీంతో ఓడి పోయింది. ప్రధానంగా పేలవమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్ ను కోల్పోయింది. ఇదే సమయంలో బ్యాటింగ్ పరంగా కూడా చేతులెత్తేసింది. దీంతో గ్రూప్ బిలో టాప్ లో ఉన్న భారత జట్టును దాటేసింది దక్షిణాఫ్రికా. ఏయే జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయనే దానిపై కూడా కామెంట్ చేసింది మిథాలీ రాజ్(Mithali Raj).
భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ , ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా జట్లు పటిష్టంగా ఉన్నాయని అంచనా వేసింది. ఇందులో సెమీస్ కు వెళ్లేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయ పడింది. కాగా మిథాలీరాజ్ పాకిస్తాన్ జట్టును చేర్చక పోవడం విశేషం.
Also Read : కీవీస్ సీరీస్ కు కెప్టెన్లుగా ధావన్..పాండ్యా