Mithali Raj : మిథాలీ రాజ్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ లో ఆడాలని ఉంది
Mithali Raj : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ మహిళా క్రికెటర్ గా పేరొందారు హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్(Mithali Raj). భారత క్రికెట్ జట్టులో ఒక రకంగా ఆమెను అంతా విమెన్ సచిన్ అని పిలుస్తారు.
ఆమె సాధించిన రికార్డులు లెక్కలేదు. క్రికెట్ అంటే కేవలం పురుషులకు మాత్రమే అని అనుకునే భారత దేశంలో మహిళలు , యువతులు, బాలికలు కూడా క్రికెట్ ఆడతారంటూ నిరూపించింది.
తానే వారందరిక ఆదర్శంగా నిలిచింది. 10,000 వేల పరుగులు చేసిన అరుదైన విమెన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. క్రికెటర్ గా, ఫీల్డర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్ గా ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అందుకుంది.
ప్రపంచ కప్ ను తన సారథ్యంలో భారత్ కు అందించాలన్నది ఆమె చిరకాల స్వప్నం. కానీ దానిని అందుకోలేకుండానే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా రిటర్మైంట్ ప్రకటనను వెనక్కి తీసుకునే ఛాన్స్ లేక పోలేదని ప్రచారం జరుగుతోంది. ఐసీసీ హండ్రడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్ కాస్ట్ లో మిథాలీ రాజ్ మాట్లాడారు.
ఈ మేరకు సంచలన కామెంట్స్ చేసింది. తాను మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది లో బీసీసీఐ మహిళల కోసం ఐపీఎల్ ను ప్రారంభించాలని నిర్ణయించింది
. ఒక వేళ అది గనుక స్టార్ట్ అయితే తాను బరిలో ఉంటానని చెప్పకనే చెప్పింది. దీంతో ప్రస్తుతం మిథాలీరాజ్(Mithali Raj) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ మైదానంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : లంకేయుల దెబ్బకు పాక్ విల విల
Mithali Raj said, "It would be lovely to be part of the women's IPL. I'm open to coming out of retirement." (To ICC).
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022